GV Prakash Kumar | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం లియో చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరెక్షన్లో చేస్తున్న దళపతి 68 (Thalapathy 68)పై ఫోకస్ పెట్టాడు విజయ్. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్లలో ఒకడు జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar).
ఈ యువ సంగీత దర్శకుడు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. మళ్లీ దళపతి విజయ్‌తో సినిమా ఎప్పుడు చేస్తారని యాంకర్ జీవీ ప్రకాశ్ కుమార్ ను ప్రశ్నించారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ స్పందిస్తూ.. అది దర్శకుల చేతుల్లోనే ఉందన్నాడు. విజయ్, వెట్రిమారన్ కాంబినేషన్‌పై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్ట్ ఒకే కావాలంటే అన్నీ కుదరాలని అన్నాడు. ఈ ఇద్దరు ప్రస్తుతం పెట్టుకున్న కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాత సినిమా కోసం రెడీ కానున్నారు.
సుధా కొంగర డైరెక్షన్లో విజయ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో విజయ్-వెట్రిమారన్లో సినిమా వచ్చే అవకాశాలున్నాయి. అభిమానులు కూడా వీరిద్దరి కాంబో కోసం ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చాడు జీవీ ప్రకాశ్ కుమార్. ఈ యువ కంపోజర్ మంచి నటుడని తెలిసిందే. విజయ్, జీవీ ప్రకాశ్ కుమార్ కాంబినేషన్లో ఇప్పటికే తలైవా, తేరి సినిమాలు వచ్చాయి.
జీవీ ప్రకాశ్ కుమార్ ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో ఆది కేశవ, టైగర్ నాగేశ్వరరావు, VNRTrio, దుల్కర్ సల్మాన్-వెంకీ అట్లూరి సినిమాలు చేస్తున్నాడు.