Chiranjeevi | త్వరలోనే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే రౌడీబాయ్, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఓకే ఫ్రేములో ఉంటే ఎలా ఉంటుంది.
ఓ ఈవెంట్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చిట్‌చాట్ చేశాడు. ఏవీలో మెగాస్టార్ జర్నీ చూస్తుంటే భావోద్వేగానికి గురయ్యానని చెప్పాడు విజయ్ . ఈ రోజు తాను ఈ స్థితిలో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదన్నాడు. మీరు మెగాస్టార్ , పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అవుతారని ఊహించారా అని విజయ్ దేవరకొండ అడిగాడు. దీనికి చిరంజీవి మాట్లాడుతూ..ఆ ఊహ ఒక్క రోజులో జరిగింది కాదు. నా మనసులో నిత్యం కొన్ని విజువల్స్ చూసేవాడిని. స్కూల్లో, కాలేజీలలో డ్రామాలు, నాటకాల్లో పాల్గొని ఉత్తమ నటుడి అవార్డులు అందుకున్నాను. ప్రజలు నన్ను గుర్తించి మెచ్చుకునేవారు. నాకు చాలా గర్వంగా అనిపించేది. ఆ ప్రశంస నాలో కోరికను పెంచింది. దీంతో సెలబ్రిటీలు చాలా ఎక్కువ అటెన్షన్ పొందుతారని తెలుసుకున్నా.
నా ఇష్ట దేవుడైన హనుమంతుడిని ప్రార్థిస్తూ.. నేను నా కల కోసం పని చేస్తూనే ఉన్నాను. నన్ను నేను నమ్ముకుని ఇండస్ట్రీలో పెద్దగా ఎదిగాను. నేను అలాంటి స్థాయికి చేరుకుంటానని నాకు తెలుసునన్నాడు. చిరంజీవి కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారన్న విజయ్ దేవరకొండ.. మీ కుటుంబంలో ఫ్యామిలీ స్టార్ ఎవరని చిరును అడిగాడు. చిరంజీవి స్పందిస్తూ.. తన తండ్రి తన ఫ్యామిలీ హీరో అని, ఫ్యామిలీ స్టార్ అని అన్నారు. మా నాన్న సంపాదించేది తక్కువే అయినా, అమ్మానాన్నల బాగోగులు చూసుకునేవాడని చెప్పాడు.
MEGASTAR @KChiruTweets Garu talks about his FAMILY STAR – his father – in a conversation with our #FamilyStar @TheDeverakonda ❤🔥#Chiranjeevi #SuvarnaMedia #VijayDeverakonda #FamilyStar pic.twitter.com/a5KJ7KxSh8
— Suvarna Media (@suvarna_media) April 1, 2024