రవితేజ (Ravi Teja) నటించిన ఫన్ మాస్ ఎంటర్టైనర్ ధమాకా (Dhamaka). త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 23న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. శ్రీలీల (Sreeleela) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. తొలి రోజు నుంచి మాస్ మహారాజా మార్క్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ మంచి వసూళ్లు రాబడుతోంది ధమాకా. ఈ సందర్భంగా హైదరాబాద్లో టీం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈవెంట్కు హాజరైన నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) హీరో రవితేజను ఆకాశానికెత్తేశాడు. ఏ హీరో కూడా తన కెరీర్లో రవితేజ లాగా ఎక్కువ మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయలేదని అన్నాడు. రవితేజ సినిమా విడుదలైన ప్రతీసారి ఏదో ఒక్క కామెంట్స్ చేసే విమర్శకులు ధమాకా సినిమాతో ఒక్కసారిగా సైలెంట్ అయ్యారని చెప్పాడు. రవితేజ జోనర్, క్లాస్ ప్రత్యేకమైనదని, సిల్వర్స్క్రీన్పై ఎలా నటించాలో ఆయననను చూసి ప్రతీ ఒక్కరూ నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు బండ్ల గణేశ్.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ధమాకా చిత్రాన్ని సంయుక్తంగా తెరకెంచాయి. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. రవితేజ నెక్ట్స్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర, పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర్రావు లైన్లో ఉండగా.. కీలక పాత్రలో నటిస్తున్న వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.