Chetan Baradwaj| ఆ క్రెడిట్ అంతా హీరో కిరణ్ అబ్బవరందే: చేతన్ భరద్వాజ్
'RX 100' చిత్రంలోని పిల్లారా సాంగ్ తో సెన్సేషన్ సృష్టించాడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ (Chetan Baradwaj). తాజాగా కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం చిత్రానికి చేతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్ కు మంచి స్పందన వస్తోంది.

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ (Chetan Baradwaj) ఆ పేరు వినగానే ‘RX 100’ చిత్రం లోని పిల్లారా సాంగ్ గుర్తుకు వస్తుంది. ఆ పాట కుర్రకారును ఉర్రూతలూగించి ఆడియన్స్ లో ఏంతో బజ్ ను క్రియేట్ చేసింది. ఆ తరువాత తను చేసిన ‘మన్మధుడు2’, ‘ఆదిత్య 369’, ‘7’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మళ్లీ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘SR కళ్యాణమండపం – Est.1975’ (SR Kalyanamandapam) చిత్రం ద్వారా తన పాటలతో సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి సంగీత ప్రియుల మనసులను దోచుకున్నాడు. ‘SR కళ్యాణమండపం’ చిత్రంలోని పాటల విజయం గురించి సినీ పాత్రికేయుల సమావేశంలో చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ..SR కళ్యాణమండపంలో మూడు డిఫరెంట్ సాంగ్స్ ను కంపోజ్ చేయడం చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇంతకుముందు నేను చేసిన RX 100, గుణ 369, మన్మధుడు 2, 7 ఇలా ప్రతి సినిమాను ఛాలెంజింగ్ గా తీసుకొని దర్శకుడి అభిప్రాయం మేరకు మ్యూజిక్ ఇచ్చానన్నాడు.

ఆ క్రెడిట్ అంతా కిరణ్ దే..
హీరో కిరణ్ ఆబ్బవరం సూచన మేరకు హీరో ఇంట్రడక్షన్ సీన్ కు అల్ ఓల్డ్ సాంగ్స్ డి.జె. మిక్సింగ్ చేయడం జరిగింది. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా కిరణ్ ఐడియాలజీ తో చేశాం. ఆ క్రెడిట్ అంతా కిరణ్ కె చెందుతుంది. ఈ సినిమాలోని పాటలు ఇంత పెద్ద హిట్ అవడానికి చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె, నిర్మాతలు ప్రమోద్, రాజు, హీరో కిరణ్ అబ్బవరం లే ప్రధాన కారణం. వీరిలో మంచి అభిరుచి ఉండడం వలనే పాటలతో పాటు సినిమా కూడా పెద్ద విజయం సాధించింది.
ప్రతి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెలోడీ కంటెంట్ మిస్సవకుండా జాగ్రత్త పడతాను. అలాగే ఆ సీన్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత అవసరమో అంతే ఇస్తూ సీన్ కు మించి ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాను. ప్రతీ సినిమాను కూడా నా దృష్టిలో హిట్ సినిమాగానే భావిస్తాను. బాధలో వుండే మనిషికి హ్యాపీగా వుండే కంటెంట్ సినిమా చూపిస్తే నచ్చకపోవచ్చు, హ్యాపీగా వుండే మనిషికి బాధగా వుండే సినిమా నచ్చకపోవచ్చు. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేము.
నా ఫ్యూచర్ ప్రాజెక్ట్ అజయ్ భూపతి దర్శకత్వంలో ప్రామిసింగ్ యాక్టర్స్ శర్వానంద్, సిద్ధార్ద్ లు నటిస్తున్న మహాసముద్రం సినిమా చేస్తున్నాను. ఈ సినిమా నుండి ‘రంభ రంభ’ సాంగ్ ను విడుదల చేశాం. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో నేను చేయబోయే మరిన్ని ప్రాజెక్ట్స్ విశేషాలు తెలియజేస్తానని ముగించారు.
ఇవి కూడా చదవండి..
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Mahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

