Tharun | ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలుకొని, హీరోగా వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకుల మన్ననలు పొందిన తరుణ్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నా… అప్పుడప్పుడూ వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. టాలీవుడ్ ఈవెంట్లలో పాల్గొంటూ అభిమానులకు కనువిందు చేస్తూ ఉన్న తరుణ్, తాజాగా తన సోషల్ మీడియా పోస్ట్‌తో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.తాజాగా అమెరికాలోని లాస్ వెగాస్ పర్యటనలో ఉన్న తరుణ్, అక్కడ దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత నటుడు డాన్ లీ తో కలసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుండటమే కాదు, అభిమానులకి సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇన్నాళ్లకు మీరిలా కనిపించడం చాలా ఆనందంగా ఉంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. “మళ్లీ సినిమాల్లోకి రావాలి” అంటూ కోరుతున్నారు.అయితే తరుణ్ లుక్ కూడా కాస్త అభిమానులని ఆందోళనకి గురి చేసింది. ఒకప్పుడు స్మార్ట్ గా ఉండే తరుణ్ ఇప్పుడు బక్క చిక్కి తెల్లగడ్డంతో రఫ్ గా కనిపిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా, డాన్ లీ ఇప్పటికే తన నటనతో కొరియన్ సినిమాల ద్వారానే కాక, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోనూ చోటు సంపాదించుకున్నారు. ఓటీటీలో విడుదలైన ఆయన సినిమాలు విశేషమైన ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో, సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్లో రానున్న స్పిరిట్ సినిమాలో డాన్ లీ కీలక పాత్ర పోషించనున్నారన్న వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయం అధికారికంగా ప్రకటించకపోయినా, డాన్ లీ–తరుణ్ కలసిన ఫోటో బయటకు రావడంతో, “స్పిరిట్” మూవీపై మరోసారి హైప్ పెరిగింది. ఈ ఫోటోతో ట్రెండింగ్‌లోకి వచ్చిన తరుణ్, నిజంగానే మళ్లీ వెండితెరపై కనిపిస్తారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మరి త్వరలో తరుణ్ నుంచి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా? వేచి చూడాల్సిందే! ఒకప్పుడు తరుణ్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలని మించి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ హీరో.