Thanuja | బిగ్‌బాస్ తెలుగు 9 షోలో సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి టాప్ కంటెస్టెంట్‌గా ఎదిగిన తనూజ పుట్టస్వామి, రన్నరప్‌గా నిలిచినా విన్నర్ రేంజ్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. సెంటిమెంట్, ఎమోషన్స్, రిలేషన్స్, సీక్రెట్ లవ్ ట్రాక్, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌లో తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. టైటిల్‌కు అడుగు దూరంలో ఆగిపోయినా, ఆమె పాపులారిటీ మాత్రం ఆకాశాన్ని తాకింది. కన్నడ, తమిళం, తెలుగులో పలు సీరియల్స్ చేసిన తనూజకు తెలుగులో ‘ముద్దమందారం’ సీరియల్ భారీ గుర్తింపునిచ్చింది. అదే ఆమెను బుల్లితెర స్టార్‌గా నిలబెట్టింది. ఈ క్రేజ్‌నే బిగ్‌బాస్ వరకు తీసుకొచ్చింది. అయితే బిగ్‌బాస్ షోకి రావడం వెనుక ఆమెకు స్పష్టమైన ప్లాన్ ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది.
గ్రాండ్ ఫినాలే తర్వాత శివాజీతో ఇచ్చిన ఇంటర్వ్యూలో తనూజ కీలక విషయాలు వెల్లడించింది. ఇకపై సీరియల్స్ చేయబోనని స్పష్టం చేసింది. ఇప్పటికే ఓ సినిమా చేసి పూర్తి చేసానని, అది విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పింది. అంతేకాదు, ఓ ఓటీటీ సిరీస్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. బిగ్‌బాస్ కారణంగా ఆ ప్రాజెక్ట్ వాయిదా పడిందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఇక తన టార్గెట్ పూర్తిగా బిగ్ స్క్రీన్ అన్నది క్లియర్‌గా చెప్పింది తనూజ. గతంలో ‘లీగల్లీ వీర్’ అనే కోర్ట్‌రూమ్ డ్రామాలో ప్రధాన పాత్రలో నటించినా, ఆ సినిమా పెద్దగా గుర్తింపు పొందలేదు. అయితే ఇప్పుడు బిగ్‌బాస్ ద్వారా వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని, సినిమాలపై ఫోకస్ పెట్టాలని ప్లాన్ చేస్తోందట.
బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన చాలా మంది ఆర్టిస్టులకు మొదట్లో అవకాశాలు వచ్చినా, లాంగ్రన్ సక్సెస్ సాధించలేకపోయారు. ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేసి తనూజ సినిమాల్లో నిలదొక్కుకుంటుందా? బుల్లితెరకు గుడ్‌బై చెప్పి వెండితెరపై సత్తా చాటుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సీరియల్స్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అయినా, తనూజ కెరీర్లో ఇది కీలక మలుపుగా చెప్పుకోవచ్చు.