అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా గుణశేఖర్ శాకుంతలం సినిమాకు సైన్ చేసిన సమంత చూస్తుండగానే ఈ సినిమా కంప్లీట్ చేసింది. అర్హ షూటింగ్ కంప్లీట్ అయిన కొద్ది రోజులకే సమంత మూవీ షూటింగ్ కూడా పూర్తైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సమంతకు గ్రాండ్‌గా సెండాఫ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
సెలబ్రేషన్స్ తర్వాత సమంత చిత్రం కోసం పని చేసిన వారందరితో కలిసి ఫొటోలు దిగింది. శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి కావడంపై స్పందించిన సామ్ .. ‘సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం నా జీవితాంతం గుర్తుండిపోతోంది. నా చిన్నప్పటి నుంచి ఇలాంటి పురాణగాథలను వింటూ వచ్చాను. ఇప్పుడు కూడా ఏం మారలేదు. ఇప్పటికీ ఆ కథలంటే ఇష్టం. ఇక గుణ శేఖర్ గారు నాకు గాడ్ ఫాదర్‌లా అయిపోయారు. నా కలను నిజం చేసినందుకు ధన్యవాదాలు అని సమంత పేర్కొంది.
బన్నీ కూతురు అర్హ ఈ చిత్రంలో భరతుడు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ భాషలలో నిర్మితమవుతుంది. దేవ్ మోహన్ ఇందులో దుష్యంతుడు పాత్ర పోషించాడు. సమంత శకుంతలగా కనిపించనుంది. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ సినిమాగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.