ధనుష్ రఘుముద్రి, హెబ్బాపటేల్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘థాంక్యూ డియర్’. శ్రీకాంత్ దర్శకుడు. బాలాజీ రెడ్డి నిర్మాత. ఆగస్ట్ 1న విడుదలకానుంది. బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ప్రపంచమంతా ఫేస్ చేస్తున్న ఓ బర్నింగ్ ఇష్యూని తీసుకొని, దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ మేళవించి ఈ సినిమా తీశామని, స్క్రీన్‌ప్లే సరికొత్త పంథాలో ఉంటుందని దర్శకుడు తెలిపారు.
మంచి కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కించామని, ముక్కోణపు ప్రేమకథగా ఆకట్టుకుంటుందని నిర్మాత పేర్కొన్నారు. నాగ మహేష్, రవిప్రకాష్, ఛత్రపతి శేఖర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, రచన-దర్శకత్వం: తోట శ్రీకాంత్ కుమార్.