Thangalaan Movie | తమిళ స్టార్ నటుడు విక్రమ్, పా. రంజిత్ (Pa Ranjith) కాంబోలో వచ్చిన తాజా చిత్రం తంగలాన్ (Thangalaan). కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. కేవలం 3 రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ సినిమాలో విక్రమ్‌తో పాటు మాళవిక మోహనన్ నటనకు ప్రేక్షకుల ఫిదా అవుతున్నారు. అయితే తంగలాన్ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించిన సందర్భంగా మేకర్స్ తంగలాన్ మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇక ఈ వీడియోలో సినిమా కోసం విక్రమ్ ఎంత కష్టపడ్డారో చూపించారు.
ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొతు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించగా.. ‘సర్పట్ట పరంపర’ ఫేమ్ పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీ రోల్స్ పోషించారు.
Also Read..