AP News | గుళికల మందు చల్లుతూ 8 మంది రైతు కూలీలకు అస్వస్థత
AP News | తూర్పు గోదావరి జిల్లా బిక్కవోరు మండలం పందలపాకలో 8 మంది రైతు కూలీలు అస్వస్థతకు గురయ్యారు.
అమరావతి : తూర్పు గోదావరి జిల్లా బిక్కవోరు మండలం పందలపాకలో 8 మంది రైతు కూలీలు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని శ్రీధర్, నారాయణరెడ్డికి చెందిన 15 ఎకరాల్లో గుళికల మందు (Spraying pellets) చల్లేందుకు 10 మంది రైతు కూలీలు ( Farmer laborers) పొలంలోకి వెళ్లారు. మందు చల్లిన తరువాత మజ్జిగ తాగి మళ్లీ పనిలోకి ఉపక్రమించారు. కొద్దిసేపటికే 8 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
భూ యజమాని 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సకాలంలో అక్కడికి చేరుకుని అంబులెన్స్ కూలీలను అనపర్తి ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేసింది. విషయం తెలుసుకున్న అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బాధితులను ఆసుపత్రిలో పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఆసుపత్రి వైద్యుడు మాట్లాడుతూ అస్వస్థతకు గురైన రైతు కూలీలను సకాలంలో ఆసుపత్రికి తీసుకు రావడం వల్ల సరైన వైద్యం అందించామని, ప్రస్తుతం కూలీలంతా కోలుకుంటున్నారని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

