Tandel | నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతాఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్న భావోద్వేగ ప్రయాణమే ఈ సినిమా. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే. శనివారం దేవిశ్రీప్రసాద్ పుట్టినరోజు. ఈ సందర్శంగా ‘తండేల్’ టీమ్ ఆయనకు శుభాకాంక్షలు అందించింది.
నాగచైతన్య, చందూ మొండేటి, బన్నీవాసు కలిసి దేవీశ్రీకి బర్త్‌డే విషెస్ తెలుపుతున్న ఓ ఫొటోని మేకర్స్ విడుదల చేశారు. ‘తండేల్’లో దేవిశ్రీ మ్యూజిక్ మ్యాజిక్ చేయబోతున్నదని, త్వరలోనే మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెడతామని మేకర్స్ తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్, ఎడిటింగ్: నవీన్ నూలి.