Nithin | నితిన్ ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులని ఎంతగా అలరించే వారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు కూడా మంచి హిట్స్ అయ్యేవి. కాని ఈ మధ్య ఆయన చేసిన ప్రయోగాలు ఫలించడం లేదు. నితిన్ కెరీర్ లో ఫ్లాప్స్ కొత్తేమి కాదు. ఒక దశలో కెరీర్ ముగిసింది అనుకున్న టైమ్ లో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయి మంచి హిట్స్ దక్కించుకున్నాడు. ఇటీవల విడుదలైన ‘రాబిన్ హుడ్’ చిత్రం మంచి హిట్ దక్కించుకుంటుంది అని అందరు అనుకున్నారు. కాని అది కూడా నిరాశపరిచింది.. ఇప్పుడు ఆయన చేస్తున్న ‘తమ్ముడు’ సినిమా అంచనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.
తమ్ముడు చిత్రాన్ని స్టార్ నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులని తప్పక ఆకట్టుకుంటుందని అంటున్నారు. ‘వకీల్ సాబ్’తో మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమ్ముడు చిత్రంలో నితిన్, సీనియర్ నటి లయ అక్క పాత్రల్లో కనిపించనున్నారు. కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్గా నటిస్తుండగా, ఓ కీలక యాక్షన్ ఎపిసోడ్ కోసం రెండు కోట్ల రూపాయల బడ్జెట్ వేశారన్న వార్తలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి.
ఈ సినిమా రిలీజ్ డేట్ పై కొంత కాలంగా సస్పెన్స్ ఉంది. ఇప్పుడు, అప్పుడు అంటూ వార్తలు తెగ వైరల్ కాగా, అన్ని అనుమానాలకు తెరదించుతూ మూవీ టీమ్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మూవీ డైరెక్టర్ వేణు శ్రీరామ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ స్పెషల్ వీడియో విడుదల చేస్తూ.. జులై 4న రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ వీడియోలో సినిమాలో నటించిన లయ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్, సప్తమి గౌడ, బేబి శ్రీరామ్ ఇలా ఒక్కొక్కరుగా వచ్చి డైరెక్టర్ వేణుకు బర్త్ డే విషెస్ చెబుతూ కనిపించారు. అలానే మన సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు , ప్రమోషన్లు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అంటూ అందరూ ఒకే ప్రశ్న వేస్తారు. వాళ్ల ప్రశ్నలకు డైరెక్టర్ ఇచ్చే ఎక్స్ ప్రెషన్లు క్రేజీగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి నేను ఇన్ఫార్మ్ చేస్తాను.. అంటూ సస్పెన్స్ క్రియేట్ చేయగా, చివరకు నిర్మాత దిల్ రాజు, శిరీష్ వచ్చి వేణు శ్రీరామ్ బర్త్ డే కేక్ కట్ చేస్తూ జులై 4న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించేస్తారు. వీడియో ఆకట్టుకుంటుంది.