Thammudu | టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ ‘తమ్ముడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. చివరిగా రాబిన్ హుడ్‌తో ప్రేక్షకులని పలకరించగా, ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో ఇప్పుడు దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తమ్ముడు సినిమా చేశారు. ఇది జూలై 04న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇలా సినిమాపై ఆసక్తిని కలిగించే ప్రయత్న చేశారు. మరో రెండు రోజులలో తమ్ముడు చిత్రం విడుదల కానుండగా, చిత్ర బృందం రిలీజ్ ట్రైలర్ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది.
నేను పుట్టినప్పుడే మా అమ్మ చనిపోయింది.. అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది.నాకు అమ్మ అయిన నాన్న అయిన అన్నీ మా అక్కే అనే డైలాగ్ ఈ మూవీ సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందుతుంది అని తెలియజేస్తుంది. ట్రైలర్ ఎమోషన్స్, యాక్షన్ తో నిండిపోయింది. మూవీపై భారీ అంచనాలే పెంచింది. ఈ చిత్రం నితిన్‌కి తప్పక మంచి హిట్ ఇస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇందులో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వాశిక కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్రంలో నితిన్ కి అక్కగా ఒకప్పటి హీరోయిన్ లయ నటిస్తుండగా, ఈ చిత్రంతోనే రీ ఎంట్రీ ఇస్తుంది.
మూవీకి సంబంధించిన విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘తమ్ముడు చిత్రం 1999లో రిలీజై టాలీవుడ్లో ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయింది. అయితే పవన్‌కు వీరాభిమాని అయిన నితిన్ ఇదే టైటిల్‌తో సినిమా చేశారు. సినిమా టైటిల్ ఒక్కటే అయినప్పటికీ స్టోరీలు మాత్రమ వేర్వేరుగా ఉండనున్నాయి. అయితే ఈ సినిమా టైటిల్ వాడడం పట్ల తాను సంతోషంగా లేనని నితిన్ రీసెంట్గా పాల్గొన్న ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ కథకు ఆ టైటిల్ మాత్రమే న్యాయం చేస్తుందని ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ వేణు శ్రీరామ్ భావించి పట్టుబట్టి మరీ తనను ఒప్పించినట్టు నితిన్ చెప్పుకొచ్చారు.