Thammudu | ఒకప్పుడు మంచి విజయాలతో ప్రేక్షకులని ఎంతగానో థ్రిల్ చేసిన నితిన్ ఈ మధ్య సరైన సక్సెస్‌లు అందుకోలేకపోతున్నాడు. చివరిగా వచ్చిన రాబిన్ హుడ్ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇప్పుడు తమ్ముడు అనే సినిమాతో పలకరించబోతున్నాడు. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జులై 4 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో ఒకప్పటి హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తుంది. లయ ఈ సినిమాలో నితిన్ కి అక్క పాత్రలో కనిపించనుంది. ఇక లయకు కూతురిగా, నితిన్ కి మేనకోడలుగా ఈ సినిమాలో ఒక పాప నటిస్తుంది.
ఈ సినిమాలో నితిన్ కి మేనకోడలుగా నటిస్తున్న పాప ఎవరనే ఆసక్తి అందరిలో ఉంది. ఆ పాప పేరు దీత్య. ఈ పాప ఎవరో కాదు తమ్ముడు సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కూతురే. వేణు శ్రీరామ్ గతంలో పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ డైరెక్ట్ చేయగా ఇప్పుడు నితిన్ తో తమ్ముడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమతో తన కూతురు దీత్యని నటింపచేస్తున్నాడు. దీత్య కూడా ప్రమోషన్స్ లో పాల్గొని తన క్యూట్ క్యూట్ మాటలతో అందరిని అలరిస్తుంది. పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటుంది. తన తండ్రిలాగే తనకు కూడా పవన్ కళ్యాణ్ తన ఫేవరేట్ హీరో అని చెప్పింది. ఈ సినిమా తర్వాత కూడా దీత్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. తమ్ముడు సినిమాలో లయకు కూతురిగా, నితిన్ కి మేనకోడలుగా దీత్య ఎలా మెప్పిస్తుందో చూడాలి.
ఇటీవలవిడుదలైన ట్రైలర్‌కి కొంత పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. దిల్ రాజు మాటల ప్రకారం ఈ సినిమా సెంటిమెంట్స్, ఎమోషన్స్ యాక్షన్ మిక్స్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందట. ఆయన ఈ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకూ డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు డీసెంట్ ధరకు అమ్ముడుపోయాయి. ఇతర నాన్ థియేట్రికల్ హక్కులు కూడా క్లోజ్ అయ్యాయని సమాచారం. ఈ సినిమా రిజల్ట్ మీదే నితిన్ భవిష్యత్తు కూడా ఆధారపడేలా కనిపిస్తోంది.