Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘ఓజీ’ (OG) నుంచి అభిమానులకు ఓ మేకింగ్ సర్ప్రైజ్ వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్, తాజాగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) కి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది, లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియోలో తమన్ స్వయంగా స్టూడియోలో వాయిద్య పరికరాలను వాయిస్తూ కనిపించగా, ఆయన ఎక్స్ప్రెషన్స్, డెడికేషన్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. కథానాయకుడి యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకంగా ఈ బీజీఎం రూపొందించినట్టు సమాచారం. ఇందులో ముఖ్యంగా జపాన్‌కు చెందిన అరుదైన వాయిద్య పరికరాలను ఉపయోగించడం విశేషం.
అవి సృష్టించే విభిన్నమైన శబ్దాలే సినిమా యాక్షన్ సీన్స్‌కి కొత్త ఉత్సాహాన్ని, ఇంటెన్సిటీని తెచ్చిపెట్టనున్నాయి.ఈ బీజీఎం క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పవన్ కల్యాణ్ అభిమానులు తమ ఉత్సాహాన్ని కామెంట్ల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. “తమన్ మళ్లీ మ్యాజిక్ చేస్తున్నాడు”, “OG బీజీఎం వింటుంటే గూస్బంప్స్ వస్తున్నాయి” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. గతంలో ‘వీరసింహారెడ్డి’, ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్బస్టర్లకు సంగీతం అందించిన తమన్, ఇప్పుడు ‘ఓజీ’తో మరో సెన్సేషనల్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకోనున్నాడని అభిమానులు గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే ‘ఓజీ’ సినిమాపై ఉన్న అంచనాలు ఇప్పుడు మరింత పెరిగినట్టే అని చెప్పాలి.
ఇక ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ మూవీలో పవన్ సమురాయ్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. మాఫియా, గన్, పవర్ ఫుల్ వెపన్స్, గ్యాంగ్ స్టర్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ‘ఓజీ’ని డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తుండగా, ఈ మూవీ నుండి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులకి తెగ నచ్చేసాయి. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం సెపరేట్‌గా కొన్ని గన్స్ కూడా డిజైన్ చేయించారనే టాక్ కూడా నడుస్తుంది. హరిహర వీరమల్లుతో నిరాశపరిచిన పవన్ కళ్యాణ్ ఓజీతో బిగ్గెస్ట్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు.
#OgBgm
This instrument is calked Japanese ( koto )
Just tried With A violin Bow 🖤
Sounded this way 🤪🤯 pic.twitter.com/4xI3VE9Yyv— thaman S (@MusicThaman) September 6, 2025