Thaman |టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన ఎనర్జీతో పాటు మాస్ బీట్స్‌తో ప్రేక్షకులను ఎప్పుడు థ్రిల్ చేస్తూనే ఉన్నాడు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహరాజ్’ వంటి చిత్రాలకు ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లు, మాస్ బీట్స్ పెద్ద హిట్ అయ్యాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘ఓజీ’కి కూడా తమన్ అద్భుతమైన ట్యూన్స్, బీట్స్ అందించి, ఆడియన్స్‌ను మంత్రముగ్దులని చేశాడు. ‘ఓజీ’లో పవన్ ఎంట్రీ సీన్స్‌లో ఆయన సౌండ్ ఇచ్చిన BGM భారీగా వైరల్ అయింది.తాజాగా తమన్ మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. బాలయ్య హీరోగా రూపొందుతున్న ‘అఖండ 2’ కోసం ఆయన మరింత ఉత్సాహం చూపుతున్నారు.
తాజాగా థమన్ తన తలకి ‘NBK’ అని రాసిన బ్యాండేజ్ కట్టుకుని తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోని చూసిన బాలయ్య అభిమానులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. “ఇంత డెడికేషన్ చూపించే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరూ లేరు” అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు వ్యంగ్యంగా కూడా కామెంట్లు చేస్తున్నారు. “నిన్న కళ్యాణ్ తమన్, ఈ రోజు నందమూరి తమన్, రేపు ఇంకెవరు?” అని, “నీలో మస్తు షేడ్స్ ఉన్నాయ్ బ్రో” అని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఓజీ బ్యాండ్‌తో ఉన్న ఫొటోని బాలయ్య ఫ్యాన్స్ ఎడిట్ చేశారని కొందరు అంటున్నారు. ఏదేమైన కొన్ని సమయాల్లో తమన్ ఇమేజ్‌పై భిన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.తమన్ తన ప్రతి స్టార్ హీరో సినిమా కోసం హార్ట్ & సోల్ పెట్టి పనిచేస్తాడు. ‘
అఖండ’తో సౌండ్ బాక్సులు బద్దలుగొట్టిన ఆయన, ‘అఖండ 2’లో ఇంకెంత విధ్వంసం సృష్టిస్తాడో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ హీరో కోసం పని చేసినా తమన్ మ్యూజిక్ సౌండ్ కొత్త హైప్‌ను తెస్తుంది అనేది కచ్చితంగా చెప్పవచ్చు. ఇక నందమూరి బాలయ్య- బోయపాటి కాంబోలో రూపొందుతున్న అఖండ 2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరో హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.