Thaman | సెలబ్రిటీలు అన్న తర్వాత బయటకి వచ్చినప్పుడు కాస్త కలర్ఫుల్గా కనిపించాలని అనుకుంటారు. అందుకే వేసిన డ్రెస్ వేయకుండా, ఒక్కసారి ధరించిన వస్తువులు మరోసారి ధరించకుండా ఉంటారు. స్టార్ హీరోలు అయితే వాచీలు, గాగుల్స్ వంటి వాటిని ఒకసారి పెట్టాక మళ్లీ పెట్టరు.ఇక టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలుగుతున్న థమన్ తన షూ కలెక్షన్ గురించి చెప్పి అందరికి పెద్ద షాక్ ఇచ్చాడు. థమన్ కెరియర్ డ్రమ్మర్‌గా మొదలు కాగా, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
ఇటీవలి కాలంలో థమన్ ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలకి పని చేస్తున్నారు. పెద్ద సినిమాల్లో సగం పైగా థమన్ మ్యూజిక్ సారథ్యంలోనే రూపొందుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే థమన్ అనేలా పేరుని సంపాదించుకున్నాడు. బాలయ్య సినిమాలకి థమన్ ఓ రేంజ్లో బీజీఎం అందిస్తుంటాడు. ఒకసారి ఆయన అందించిన బీజీఎంకి థియేటర్లో స్పీకర్స్ కూడా పగిలిపోయాయి. అలా తనదైన మ్యూజిక్‌తో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. అయితే థమన్‌కి షూస్ అంటే చాలా పిచ్చి. అతను ఒకసారి వేసిన షూని మరోసారి వేసిన సందర్భాలు చాలా తక్కువ అనే చెప్పాలి.
తమన్ బయట ఎక్కడ కనిపించిన, ఏ ఈవెంట్లో కనపడినా ఆయన షూస్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. తాజాగా తమన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తన దగ్గరున్న ఖరీదైన షూల గురించి, తన దగ్గరున్న షూ పెయిర్స్ నంబర్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు.. నా దగ్గర దాదాపు 300 షూ పెయిర్స్ ఉన్నాయి. అవి అన్నీ కూడా ఎక్కువగా హెవీ వెయిట్ ఉన్న షూస్. నా దగ్గర ఉన్న ఖరీదైన షూ అంటే బ్యాలెన్స్ అనే కంపెనీ షూ ఉంది. దాని ఖరీదు మూడు లక్షల రూపాయలు. వాటిని వాడను కాని అప్పుడప్పుడు అలా చూసుకుంటూ ఉంటాను . మురికి లేని ప్లేస్ కి వెళ్ళినప్పుడు వేసుకోవాలి అని చూస్తున్నాను. నా షూ క్లీనింగ్ కూడా నేనే చేసుకుంటాను, ఎవరిని టచ్ చేయనివ్వను. స్ట్రెస్ లో ఉన్నప్పుడు షూస్ క్లీన్ చేసుకుంటాను అని తమన్ చెప్పుకొచ్చారు.