ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘తల్లి మనసు’. రచిత మహాలక్ష్మీ, కమల్ కామురాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ మధ్య తరగతి తల్లి చుట్టూ తిరిగే కుటంబ కథ ఇది. ఆమె ఎలాంటి సంఘర్షణకు గురయింది? అందుకు దారితీసిన పరిస్థితులేమిటి? అనే అంశాలను స్పృశిస్తూ ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగుతుంది’ అని చెప్పారు. సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేశామని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాతలు పేర్కొన్నారు. రఘుబాబు, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథా విస్తరణ: ముత్యాల సుబ్బయ్య, సంగీతం: కోటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.శ్రీనివాస్ (సిప్పీ).