Thalapathy Vijay | తమిళ అగ్ర నటుడు దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకలో అపశ్రుతి జరిగింది. ఒక బాలుడికి మంటలు అంటుకుని గాయాలు అయ్యాయి. నేడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా విజయ్ అభిమానులు వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే దళపతి బర్త్ డే సందర్భంగా నిర్వహించిన ఒక విన్యాస పోటిలో అపశృతి చోటు చేసుకుంది.
విజయ్ పుట్టినరోజున నీలాంగరైలో ఓ గ్రూప్ కరాటే విన్యాసాలు నిర్వహించాలనుకుంది. ఇందులో భాగంగా నిప్పు అంటించుకున్న ఒక బాలుడు తన చేతితో పెంకులు పగలకొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఘటనలో పెంకులు పగిలాయి కానీ చేతిలో ఉన్న మంట మాత్రం చల్లారలేదు. దీనితో కాపాడుదామని వచ్చిన వ్యక్తి చేతిలో పెట్రోల్ బాటిల్ ఉండడంతో సడన్‌గా ఆ మంటలు కాస్తా స్టేజ్‌పై వ్యాపించాయి. ఇక బాలుడి చేతికి మంటలు ఆర్పబోయిన మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. చివరికి అయితే ఆ మంటలు ఆర్పగలిగారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.