Vijay Thalapathy In Jawan Movie | బాలీవుడ్ కింగ్‌కాంగ్ షారుఖ్ ఖాన్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. షారుఖ్‌ను వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన మూడు చిత్రాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘జవాన్’ ఒకటి. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 2నవిడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో గెస్ట్ రోల్లో ఓ తమిళ స్టార్ హీరో నటించనున్నాడని కోలీవుడ్ వర్గాల టాక్. అట్లీ ఈ సినిమాలో అతిథి పాత్ర కోసం దళపతి విజయ్ను సంప్రదించాడట. కాగా విజయ్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే తమిళ స్టార్ విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు విజయ్ కూడా సినిమాలో కనిపిస్తే తమిళంలో కూడా ఈ చిత్రం భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందని అట్లీ భావిస్తున్నాడట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో షారుఖ్ తండ్రి, కొడుకుగా డ్యూయల్ రోల్లో నటించనున్నాడు. నయనతార ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్‌గా నటించనుంది. ప్రస్తుతం షారుఖ్ నటించిన ‘పఠాన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. దీనితో పాటు రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో ‘డుంకి’ సినిమాను చేస్తున్నాడు.