GOAT Movie | తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT). ఈ సినిమాకు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రశాంత్, వైభవ్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 05న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు వైభవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు దళపతి విజయ్ ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమాను ఒక మాస్ థియేటర్లో చూశాడు అని తెలిపాడు.
‘గోట్’ (GOAT) షూటింగ్ అయిపోయాక సాయంత్రం విజయ్ సర్ అడుగుతూ.. ఏదైనా సినిమాకు వెళదామా అన్నాడు. ఎలా సర్ అన్నాను. ఏంటి మనం సినిమాకు పోకుడదా.. నువ్వు వస్తావా రావా అంటూ అన్నాడు. దాంతో వస్తున్నా సర్ అన్నాను. ఆ టైంలో రిలీజ్ అయిన వాటిలో షారుఖ్ ఖాన్ ‘డంకీ’ ఉంటే ఆ సినిమాకు నేను, దర్శకుడు వెంకట్ ప్రభు, విజయ్ సర్ కలిసి వెళ్లాం. ఆ తర్వాతి రోజు ‘సలార్’ సినిమాకు వెళదాం అన్నాడు. అయితే ఆ సినిమా చూడడానికి ఒక సినిమా ఫ్యాన్ అయితే ఎలాంటి థియేటర్‌కు వెళతాడో అలాంటి మాస్ థియేటర్‌కి వెళ్లాడు విజయ్ సర్. హైదరాబాద్‌లో ఉన్న మాస్ థియేటర్లలో అది ఒకటి. ఆ థియేటర్‌కి వెళ్లి ‘సలార్’ సినిమా చూశాడు. ఆ థియేటర్లో టికెట్టు ఖరీదు రూ.80. అయితే అలాంటి థియేటర్లో బాల్కనీ ఫస్ట్ రో టికెట్ తీసుకుని సినిమా చూశాడు విజయ్ సర్. అయితే ఇది చాలా స్పెషల్. సర్ అనుకోని ఉంటే థియేటర్ మొత్తం బుక్ చేసుకుని చూసేవాడు. కానీ మాస్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాడు అంటూ వైభవ్ చెప్పుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Thalapathy @actorvijay watched #Salaar in a local mass theatre in Hyderabad in the front row seat to enjoy the mass cinema and audience vibes 🫡🫡 https://t.co/A1ISMKDAR1
— Vijay Fans Trends 🐐 (@VijayFansTrends) September 1, 2024