తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రానికి ‘వారసుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది విజయ్ నటిస్తున్న 66వ చిత్రం. రష్మిక మందన్న నాయికగా నటిస్త్తున్నది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షిత సహ నిర్మాతలు. బుధవారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సూట్లో క్లాస్ లుక్‌తో ఉన్న విజయ్ స్టిల్ ఆకట్టుకుంటున్నది. ద బాస్ రిటర్న్స్ అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకొంటున్నదీ సినిమా. వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కార్తీక్ పళని, సంగీతం : ఎస్ థమన్.