Jana Nayagan Event | తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు అయిన ‘దళపతి’ విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్ర ఆడియో వేడుకను మలేషియాలో నిర్వహిస్తుండటంతో తమిళనాడు నుంచి వేలాది మంది అభిమానులు అక్కడికి తరలివెళ్తున్నారు. డిసెంబరు 27న కౌలాలంపూర్‌లోని ప్రఖ్యాత బుకిట్ జలీల్ నేషనల్ స్టేడియంలో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకను కళ్లారా చూడాలని విజయ్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం అభిమానుల కోలాహలంతో నిండిపోయింది. మలేషియాకు వెళ్లే విమానాలన్నీ ఇప్పటికే ఫుల్ అయిపోయాయి. ఇమ్మిగ్రేషన్ విభాగం వద్ద ప్రయాణికుల రద్దీ పెరగడంతో భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. మలేషియాలో విజయ్‌కు ఉన్న విపరీతమైన ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఈ అంతర్జాతీయ ప్లాన్‌ను సిద్ధం చేశారు. దాదాపు 90,000 మందికి పైగా కూర్చునే వీలున్న బుకిట్ జలీల్ స్టేడియంలో ఈ వేడుక జరగనుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ లైవ్ పెర్ఫార్మెన్స్తో పాటు, చిత్ర యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొననుంది.
విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఈ వేడుకపై అక్కడి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో మలేషియా పోలీసులు కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇది కేవలం వినోద కార్యక్రమం మాత్రమే కావాలి. వేదికపై ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదు. రాజకీయ చిహ్నాలు, పార్టీ జెండాలు ప్రదర్శించడంపై కఠిన నిషేధం విధించారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విజయ్ కెరీర్లో ఇది 69వ సినిమా కావడం, ఆపై ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్తుండటంతో అభిమానులు ఈ వేడుకను ఒక పండుగలా భావిస్తున్నారు.
Half yearly leaveல வள்ளுவர் கோட்டத்தில ராட்டினம் போட்டாக் கூட கூட்டம் கூடும்.. ஆனா சென்னை ஏர்போர்ட்டில் இந்தக் கூட்டம் 🔥 For #JanaNayaganAudioLaunch 🔥 pic.twitter.com/F0LMOM0agk
— Nirmala C Sukumar (@NirmalaSuku) December 26, 2025