Thalapathy Vijay | రాజకీయల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ తన చివరి చిత్రం దళపతి69లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందరూ గోట్ సినిమానే విజయ్‌కు చివరి చిత్రం అనుకున్నారు. అయితే గోట్ కాకుండా అభిమానుల కోసం మరో సినిమాను ప్రకటించాడు విజయ్. తన చివరి చిత్రం ప్రజ సమస్యలపై ఉండబోతున్నట్లు ప్రకటించాడు.
దళపతి 69 గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను కార్తీ (ఖాకీ) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హెచ్.వినోద్ దర్శకత్వం వహించబోతున్నాడు. అనిరుధ్ సంగీతం అందించనుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ ఈ మూవీని నిర్మించనుంది. ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 2025న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా అప్డేట్ను పంచుకున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని రిపబ్లిక్ డే కానుకగా.. జనవరి 26 విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. తెలుగు మూవీ భగవంత్ కేసరి సినిమాకు రీమేక్‌గా వస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మేకర్స్ కూడా క్లారిటీ ఇస్తూ.. రీమేక్ కాదని వెల్లడించారు.
Update oda vandhurkom 🤗
69% completed ███░░#Thalapathy69FirstLookOnJan26 🔥#Thalapathy @actorvijay sir #HVinoth @thedeol @prakashraaj @menongautham #Priyamani @itsNarain @hegdepooja @_mamithabaiju @anirudhofficial @Jagadishbliss @LohithNK01 @sathyaDP @ActionAnlarasu… pic.twitter.com/FA2MbAjdAY— KVN Productions (@KvnProductions) January 24, 2025