Thalapathy 67 | దళపతి 67 మరో అప్డేట్.. భారీ మొత్తానికి డిజిటల్, శాటిలైట్ రైట్స్
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న దళపతి 67 (Thalapathy 67)కు సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమం పూర్తయింది. కాగా ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది.
సెట్స్‌పైకి వెళ్లకముందే బ్యాక్ టు బ్యాక్ ప్రకటనలతో అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నాడు విజయ్ (Vijay). లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న దళపతి 67 (Thalapathy 67)కు సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమం పూర్తయింది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, త్రిషతోపాటు పలువురు నటీనటులు ఈ ప్రాజెక్ట్‌తో భాగస్వామ్యం అయ్యారు.
కాగా ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. దళపతి 67 డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ ను దక్కించుకోగా.. సన్ టీవీ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియో ట్వీట్ చేసింది.
ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్. మాస్టర్ తర్వాత లోకేశ్ కనగరాజ్-విజయ్ కాంబినేషన్లో వస్తుండటంతో దళపతి 67పై అంచనాలు భారీగా ఉన్నాయి.
దళపతి 67 సర్ప్రైజ్..
Tudum, Our gang has a new member 😎
And that is @NetflixIndia, our official digital partner of #Thalapathy67 🔥#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @trishtrashers @anirudhofficial @Jagadishbliss pic.twitter.com/L33U4nZYNo— Seven Screen Studio (@7screenstudio) February 2, 2023
Andha saththam…
Indhiya tholaikaaatchigalil mudhal muraiyaaaga 🔥Happy to announce that @SunTV is the satellite partner of #Thalapathy67 💥#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @anirudhofficial @Jagadishbliss pic.twitter.com/Qhyzy6m4pk
— Seven Screen Studio (@7screenstudio) February 2, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

