Thalaivan Thalaivii | తమిళ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డు విన్నర్ నటి నిత్యా మీనన్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘తలైవన్ తలైవి’ అనే పేరు పెట్టారు. ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం తాజాగా ఓ టీజర్‌ను విడుదల చేసింది. తమిళంలో ‘తలైవన్’ అంటే నాయకుడు అని, ‘తలైవి’ అంటే నాయకురాలు అని అర్థం. ఈ టీజర్లో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ మధ్య ఉండే కెమిస్ట్రీని చూపించారు మేకర్స్. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యొక్క టైటిల్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.