నవీన్‌చంద్ర, దివ్యపిైళ్లె, అనన్యసేన్గుప్తా నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘తగ్గేదే లే’. భద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ప్రేమ్కుమార్పాండే, పీవీ సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌రాజు దర్శకుడు. సోమవారం హైదరాబాద్‌లో నిర్మాణ సంస్థ లోగోను వ్యాపారవేత్త పీపీరెడ్డి విడుదలచేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘తెలుగు చరిత్ర, సంస్కృతులతో కూడిన మంచి కథలను చెబుతూ కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించాం. తొలి ప్రయత్నంగా నవ్యమైన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాం’ అని తెలిపారు. ‘సస్సెన్స్ థ్రిల్లర్ కథాంశంతో సాగే ప్రేమకథా చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. నరహంతక ముఠాతో ఓ యువకుడు సాగించిన పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా సాగుతుంది’ అని దర్శకుడు చెప్పారు. రవిశంకర్, రాజారవీంద్ర ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, సినిమాటోగ్రాఫర్: వెంకట్ ప్రసాద్.