ఇప్పటికే గాడ్ ఫాదర్ (Godfather) నుంచి ‘థార్ మార్ థక్కర్ మార్’ ప్రోమో విడుదలవగా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా మేకర్స్ ‘థార్ మార్ థక్కర్ మార్’ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ (Thaar Maar Thakkar Maar Song) ను విడుదల చేశారు. సల్మాన్, చిరంజీవి క్రేజీ కాంబోలో వచ్చే ఈ పాట స్టైలిష్‌గా సాగుతూ..థియేటర్లలో ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేయడం పక్కా అని తెలిసిపోతుంది.
ఈ పాటకు ప్రభుదేవా నృత్యరీతులు సమకూర్చాడు.అనంతశ్రీరామ్ ఈ సాంగ్‌ను రాయగా..శ్రేయో ఘోషల్ పాడింది. మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీ రోల్లో నటిస్తున్నాడు.
గాడ్ ఫాదర్లో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తోపాటు సత్యదేవ్, సునీల్ కీలక పాత్రల్లో నటిన్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. గాడ్ ఫాదర్ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలవుతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.