House Arrest | జూరాల ప్రాజెక్టుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు..మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి హౌస్ అరెస్ట్
House Arrest | జూరాల ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ధర్నా సందర్భం గా మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డిని తిరుమలహిల్స్ లోని నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
మహబూబ్ నగర్ : జూరాల ప్రాజెక్టు ( Jurala Project) వద్ద బీఆర్ఎస్ ధర్నా సందర్భం గా మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డిని ( Dr. C. Laxma Reddy ) తిరుమలహిల్స్ లోని నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు (House Arrest ) చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు.
జూరాలఆయకట్టు రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సాగునీటి రంగంపై ప్రభుత్వానికి అవగాహన లేదని విమర్శించారు. జూరాలలో 8.5 టీఎంసీల నీళ్లు ఉన్నాయని,లక్షా పది వేల ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయని పేర్కొన్నారు.పంటలకు సడన్ గా నీటి విడుదల నిలిపివేయడం దారుణమన్నారు.
పంటలు కాపాడే అవకాశం ఉన్నప్పటికీ నీళ్లు ఇవ్వడం లేదని వెల్లడించారు. ప్రభుత్వం తెలివి,అవగాహన లేక డ్రింకింగ్ వాటర్ కోసం ఆపుతున్నామని చెప్తున్నారు.పంటలు వేయొద్దని ముందే రైతులను ప్రభుత్వం హెచ్చరించాల్సి ఉండే. కానీ పంటలు సాగు చేశాక నీళ్లు ఇవ్వకపోతే ఎలా? లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు ఎక్కడికిపోవాలని ప్రశ్నించారు.
ఎగువన కర్ణాటక ప్రాజెక్టులలో నీళ్లు నిండా ఉన్నాయని, ఆ రాష్ట్రాన్ని అడిగి నీళ్లు తీసుకునే వెసులుబాటు ఉందని సూచించారు. రాజకీయాల మీద వున్న శ్రద్ధ రైతుల మీద లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కేసీఆర్ ముందుచూపుతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేపట్టారని, ఆ పనులు పూర్తి చేయకుండా పెండింగ్ పెట్టారని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

