OG Effect on Mirai Movie | పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఓజీ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించగా.. డీవీవీ దానయ్య నిర్మించాడు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రంకి సంబంధించి ఇప్పటికే ప్రీమియర్స్ కూడా బుక్ అయిపోయాయి. అయితే ఈ సినిమా కోసం అరుదైన నిర్ణయాన్ని తీసుకున్నాడు మిరాయ్ చిత్ర నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. మిరాయ్ నడుస్తున్న థియేటర్లలో ఓజీ సినిమా ప్రదర్శించేందుకు అనుమతినిస్తున్నట్లు టీజీ విశ్వప్రసాద్ తెలిపాడు. విడుదల రోజున (సెప్టెంబర్ 25) మిరాయ్ నడుస్తున్న థియేటర్లలో ఓజీ నడవబోతుండగా.. మళ్లీ సెప్టెంబర్ 26 నుంచి యధావిధిగా మిరాయ్ ప్రదర్శించబోతున్నట్లు విశ్వప్రసాద్ తెలిపాడు.
Team #Mirai is showing some serious respect for Powerstar #PawanKalyan garu by dedicating all screens to #TheyCallHimOG on Sept 25th.
Catch #Mirai back in theaters on Sept 26th, with the new #VibeUndi song pumping up the energy. #OG #PawanKalyan #TejaSajja pic.twitter.com/Hqbw1TzY3E
— BA Raju’s Team (@baraju_SuperHit) September 24, 2025