Tere Ishk Mein | కోలీవుడ్ స్టార్ ధనుష్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటించిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘తేరే ఇష్క్ మే’ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. గత ఏడాది నవంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ హిందీ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. అయితే ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఈ నెల 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో అందుబాటులోకి రాబోతుంది.
గతంలో ధనుష్‌తో ‘రాంఝనా’, ‘ఆత్రంగి రే’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ధనుష్ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా నటించగా, ఒక సైకాలజీ స్టూడెంట్‌గా కృతి సనన్ మెప్పించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అందించిన అద్భుతమైన సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సుమారు 95 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ధనుష్ క్రేజ్‌ను మరోసారి చాటిచెప్పింది.