Venkateshwararao passed away | ప్రముఖ నటుడు పి. వెంకటేశ్వరరావు అనారోగ్యం కారణంతో మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఈయన కన్నుమూసారు. రంగస్థల కళాకారుడిగా పలు నాటకాల్లో నటించిన వెంకటేశ్వరావు 1965 లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన తేనెమనసులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత ఏడాదిలోనే మళ్లి కృష్ణ నటించిన కన్నె మనసులు చిత్రంలో నటించాడు. తర్వాత వరుసగా ఆత్మీయులు, మరో ప్రపంచం, సుడిగుండాలు, మట్టిలో మాణిక్యం, ముత్యాల ముగ్గు వంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.