సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ైస్టెలిష్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయమవుతున్నది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, శ్రీనిధిశెట్టి కథానాయికలు. శుక్రవారం వాలెంటైన్స్ డే సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘న్యూ జనరేష్ లవ్‌స్టోరీ ఇది. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కించాం. లవర్‌బాయ్‌గా సిద్ధు జొన్నలగడ్డ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్ బాబా, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: నీరజ కోన.