Telugu Youtuber Harsha Sai | తెలుగు యూట్యూబర్ హర్షసాయి కేసులో ట్విస్ట్‌ల మీదా ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తనను లైంగికంగా దాడి చేయడంతో పాటు మానసికంగా వేధిస్తున్నట్లు కేసు పెట్టిన యువతి తాజాగా మరో విషయంపై పోలీసులను ఆశ్రయించింది. హర్షసాయి పోలీసులకు దొరకకుండా తప్పించికుని తిరుగుతున్న విషయం తెలిసిందే. అతడి గురించి చిన్న సమాచారం దొరికిన ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. అయితే ఈ క్రమంలోనే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. హర్షసాయి పోలీసుల కళ్లుగప్పి దేశం వదిలి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది.
ఈ కేసు విషయంలో సైబారాబాద్ సీపీని కలిసిన ఆ యువతి.. హర్షసాయి దేశం వదిలి వెళ్లకుండా చూడాలని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే సోషల్ మీడియా.. డిజిటల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని యువతి ఫిర్యాదులో తెలిపినట్లు సమాచారం. మరోవైపు హర్షసాయి కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. తనంతటా తాను పోలీసులకు లొంగిపోకపోతే హర్షసాయిపై లుకౌట్ నోటీసు జారీ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.
Also Read..