Telugu Youtuber Harsha Sai | తెలుగు యూట్యూబర్ హర్షసాయి కేసులో ట్విస్ట్‌ల మీదా ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఒక సినిమా విషయంలో తనపై లైంగిక దాడి చేసినట్లు పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతి అతడిపై మరో కేసు పెట్టింది. హర్షసాయిపై ఫిర్యాదు చేసినప్పటి నుంచి తనను మరింత టార్చర్ చేస్తున్నాడని మెయిల్స్ ద్వారా మానసికంగా హింసిస్తున్నాడని తన న్యాయవాదితో వచ్చి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆ యువతి మరో కేసును నమోదు చేసింది.
ఇక యువతి ఫిర్యాదుతో హర్షసాయిపై వేధింపుల కేసును నమోదు చేశాడు. ప్రస్తుతం హర్షసాయి కోసం గాలిస్తున్నారు పోలీసులు. మరోవైపు యూట్యూబర్ హర్షసాయి భాదితులు ఇంకా చాలామంది ఉన్నారని యువతి తరపున లాయర్ తెలిపాడు. మెళ్లిమెళ్లిగా బయటకు వస్తున్నట్లు చెబుతున్నాడు. అలాగే హర్షసాయి అప్పట్లో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో దిశాకి అంబాసిడర్‌గా ఉన్న అతడిని ప్రభుత్వం తొలగించింది.
ALso Read..