Telugu Young Heroes | కుర్రహీరోల చేతినిండా సినిమాలు..కానీ సక్సెస్ మాటేంటి..!
తెలుగు ఇండస్ట్రీ (Telugu Cinema Industry)లో కొందరు హీరోలు ఎప్పుడు చూసినా కనీసం మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంటారు.. కానీ హిట్స్ మాత్రం ఒక్కటి కూడా ఉండవు. అసలు వీళ్ళకి ఇన్ని సినిమాలు ఎలా వస్తున్నాయని అనుమానం కూడా చాలామందికి వస్తుంది.
తెలుగు ఇండస్ట్రీ (Telugu Cinema Industry)లో కొందరు హీరోల జోరు చూసిన తర్వాత ఇదే ప్రశ్న అడుగుతున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా కనీసం మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంటారు.. కానీ హిట్స్ మాత్రం ఒక్కటి కూడా ఉండవు. అసలు వీళ్ళకి ఇన్ని సినిమాలు ఎలా వస్తున్నాయని అనుమానం కూడా చాలామందికి వస్తుంది. ఎందుకంటే ఏడాదికి ఎంత లేదన్న మూడు నాలుగు సినిమాలు విడుదల చేస్తూ ఉంటారు వాళ్ళు.
కాకపోతే అందులో ఒకటి కూడా విజయం సాధించదు. అయినా కూడా వాళ్లకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఈ లాజిక్ ఏంటో చాలామందికి అర్థం కాదు. ఆ హీరోలెవరురో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయికుమార్ తనయుడు ఆది (Aadi Saikumar) , కిరణ్ అబ్బవరం , శ్రీ విష్ణు. ఈ ముగ్గురు హీరోల చేతిలో ఎప్పుడు చూసినా కనీసం మూడు నాలుగు సినిమాలు ఉంటాయి. ఇప్పుడు కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకటి విడుదలకు సిద్ధంగా ఉంటే.. మరొకటి షూటింగ్ పూర్తి చేసుకుని ఉంటుంది.. ఇంకొకటి షూటింగ్ దశలో ఉంటుంది..ఈ గ్యాప్ లో ఇంకో సినిమాకు కొబ్బరికాయ కొట్టి ఉంటారు.
కావాలంటే కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినిమాల లిస్టు తీసుకోండి. గతేడాది SR కళ్యాణమండపం, సెబాస్టియన్ సినిమాలతో వచ్చిన ఈయన..ఈ ఏడాది ఇప్పటికే సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలు విడుదల చేశాడు. ఇవి కాకుండా వినరో భాగ్యము విష్ణు కథ, రూల్స్ రంజన్, మీటర్ సినిమాలలో నటిస్తున్నాడు. మరోవైపు ఆది కూడా 2022లో బ్లాక్, అతిథి దేవోభవ, తీస్మార్ ఖాన్ సినిమాలతో వచ్చాడు. ప్రస్తుతం ఈయన చేతిలో టాప్ గేర్, జంగిల్, కిరాతక, సనాతన, క్రేజీ ఫెలో లాంటి సినిమాలు ఉన్నాయి.
ఇక శ్రీ విష్ణు (Sree Vishnu)ఈ ఏడాది భళా తందనానా సినిమాతో వచ్చాడు. ఇప్పుడు అల్లూరి అంటూ మరోసారి వస్తున్నాడు. ఇందులో ఏ ఒక్క సినిమా కూడా హిట్ కాదు. అయినా కూడా వీళ్లకు ఎలా అవకాశాలు వస్తున్నాయి అనేది అర్థం కాదు. ఇందులో చిన్న లాజిక్ ఉంది. ఈ హీరోలతో సినిమాలు చేయడానికి 3 కోట్లు ఉంటే చాలు. పర్ఫెక్ట్ కమర్షియల్ ఫార్మేట్లో సినిమాలు తీసి.. హిందీ డబ్బింగ్ రైట్స్, ఓటిటితో బయట పడిపోతున్నారు నిర్మాతలు. అందుకే ఫలితంతో సంబంధం లేకుండా వీళ్లకు వరుస అవకాశాలు వస్తున్నాయి.
Read Also : Alia Bhatt | బ్రహ్మాస్త్ర-2లో ఈ స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుందన్న అలియాభట్..!
Read Also : KARAN JOHAR | ఆ వారసుడిపై కన్నేసిన కరణ్ జోహార్..నెట్టింట్లో పేలుతున్న సెటైర్లు
Read Also : OTT / Theater | ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేసే సినిమాలివే
Read Also : Geetu Royal | గీతూ ఆట తీరుపై విమర్శలు..బిగ్ బాస్‌లో ఆమెను కావాలనే హైలైట్ చేస్తున్నారా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

