జయం రవి, నయనతార జంటగా నటించిన తమిళ చిత్రం ‘ఇరైవన్’ తెలుగులో ‘గాడ్’ పేరుతో నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఐ.అహ్మద్ దర్శకత్వం వహించారు. సుధన్ సుందరం, టి.జయరాం, సి.హెచ్.సతీష్‌కుమార్ నిర్మించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘క్రైమ్ థ్రిల్లర్ కథాంశమిది.
హత్యా రహస్య శోధన చుట్టూ కథ నడుస్తుంది. అనుక్షణం ఉత్కంఠను పంచుతుంది. నయనతార పాత్ర చిత్రణ పూర్తి వైవిధ్యంగా ఉంటుంది. జయం రవి, నయనతార కాంబినేషన్లో వచ్చిన ‘తని ఒరువన్’ భారీ విజయం సాధించింది. అదే స్థాయిలో ఈ సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. వినోద్ కిషన్, రాహుల్ బోస్, విజయలక్ష్మి, నరైన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతం, సంగీతం: యువన్‌శంకర్‌రాజా.