గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా తథాస్తు క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. శివ వరప్రసాద్ దర్శకుడు. తాటి బాలకృష్ణ నిర్మాత. ఈ సినిమా ద్వారా భైరవి తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతున్నది. ఇందులో ఆమె పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తున్నది.
రొమాంటిక్ కామెడీ చిత్రమిదని, పల్లెటూరి అమ్మాయి పాత్రలో భైరవి చక్కగా ఒదిగిపోయిందని, ఆమె నటనకు మంచి ప్రశంసలు లభిస్తాయనే నమ్మకం ఉందని నిర్మాత తెలిపారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో టైటిల్, రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యశ్వంత్.