Telugu Lyric Writer Kula Shekar | తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ గేయ రచయిత కులశేఖర్ (54) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం కన్నుమూశారు. చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే, ఔనన్నా కాదన్నా, ఘర్షణ, భద్ర, సంతోషం, జయం, సైనికుడు లాంటి సూపర్‌హిట్ చిత్రాలకు పాటల రచయితగా పనిచేశారు కులశేఖర్.
అయితే వందకు పైగా సినిమాలకు స్టార్ రైటర్‌గా పనిచేసిన కుల శేఖర్ చెడు వ్యసనాలకు బానిసై కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. కుటుంబ సభ్యులతోనూ కూడా దూరంగా ఉన్నాడు. కొన్ని సంవత్సరాల కిందటా ఒక దొంగతనం కేసులో కూడా అరెస్ట్ అయ్యి ఆరు నెలలు జైలులో ఉండి బయటికి వచ్చాడు. ఇక బయటికి వచ్చిన అనంతరం గేయ రచయితగా తన కెరీర్ నాశనం అవ్వడంతో మానసికంగా చాలా కుంగిపోయారు. దీంతో అతడికి అనారోగ్య సమస్యలు రాగా.. చివరికి దయనీయ స్థితిలో మృత్యు ఒడికి చేరారు. ఇక కులశేఖర్ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియచేస్తున్నారు.