Lyric Writer Anantha Sriram |ప్రముఖ టాలీవుడ్ రచయిత అనంత శ్రీరామ్ అమరావతిలో జరిగిన హైందవ శంఖారావం బహిరంగ సభలో తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు ఇండియన్ సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతుందని.. సినిమాల్లో మన పురాణాలను వక్రీకరిస్తున్నారని.. హైందవ ధర్మ హననం జరుగుతుందని అనంత్ శ్రీరామ్ అన్నారు.
ఆయన మాట్లాడుతూ.. సమకాలీన సమాజంలో చలనచిత్రం అనేది కళా ప్రదర్శనకి ఒక ముఖద్వారంగా మారింది. అది వెండి తెర మీద అయినా బుల్లి తెర మీద అయినా.. మన చేతిలో ఉన్న బుజ్జి తెర మీదా అయిన ఈ చలనచిత్రమే. సంగీత సాహిత్య నృత్య నటనాది కళా రూపాల ప్రదర్శన ముఖద్వారంగా మారింది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ.. కళాత్మకమైన వ్యాపారం. వ్యాపారానికి కళాత్మకతని కళాత్మకతకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహటాంగానే అంగీకరిస్తున్నాను.
అయితే నేను సినిమా రంగానికి చెందినవాడిగా.. ఇప్పటిదాకా జరిగిన ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావత్ ఈ హిందూ సమాజం ముందు సినీ రంగం తరపున క్షమార్పణలు తెలుపుతున్నాను. సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది. హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక మూడు కోణాల్లో నాలుగు ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాడి మూడు కోణాల్లో జరుగుతుంది అందులో ఒకటి అందులో ఒకటి కావ్యతిహాస పురాణాల్ని వక్రీకరించడం. రెండు తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం. మూడు తెర వెనక మా ముందు అన్య మతస్తుల ప్రవర్తన.
ఈ మూడు అంశాల్లో మొదటిది.. కావ్యతిహాస పురాణాల్ని వక్రీకరించడం. వాల్మీకి రామాయణం వ్యాస భారతం. ఇవి భారత సాహితీ వాన్మయ శరీరానికి రెండు కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన ప్రభాస్ కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను.
ఈ సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపదిగా వక్తలు అభివర్ణించారు.. నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుడిని సూర్యుడు అంటే సత్యవాణి గారి లాంటి మహిళా మణులు ఒప్పుకుంటారా.! గంధర్వుల్ని చూసి గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రున్ని కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుడిని ధీరుడు, సూర్యుడు, వీరుడు, అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకు వచ్చిన కొద్దిపాటి సంపదను ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా. నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్ని దేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా. ఇలా ఒక్క భారతంలోనే కాదు వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు.. రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశాడు.
ఆఖరి అంశం మాకు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్య మతస్తులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూపదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి 15 సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను నేను పాట రాయలేదు. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం ముందు మనం తిరస్కరిద్దాం వాటికి వ్యాపారం రాదు డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తాడో మనం చూద్దాం అంటూ అనంత్ శ్రీరామ్ తెలిపాడు.
– Kalki 2898 AD
– Dum Maaro Dum Song
– PK
– Cosmic Sex
– Kaali Poster
– Akram Hussain
– A non-Hindu music director
– A non-Telugu music directorLyricist #AnanthaSriram fires on filmmakers and artists who are manipulating the facts related to Hindu dharma. He calls for… pic.twitter.com/iaAgX4xvuS
— Aakashavaani (@TheAakashavaani) January 5, 2025