తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry)లో ఉన్నంత మంది కమెడియన్లు (Comedians) మరే ఇండస్ట్రీలోనూ లేరు. ఇతర ఇండస్ట్రీల్లో ఒకర్ని చూస్తుంటే మరొకరికి కడుపు మంట. తమిళ్లో అయితే ఏ ఇద్దరు టాప్ కమెడియన్లు ఒకే సినిమాలో కనిపించరు. అంత ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మన దగ్గర మాత్రం అలా ఉండదు. ఒకే సినిమాలో.. 30 మంది కలిసి నటించమన్నా కూడా నటిస్తారు. అంత ఫ్రీగా ఉంటారు. ఇప్పుడు ఈ కమెడియన్లంతా కలిసి ఇండస్ట్రీకి కొత్త పాఠాలు నేర్పుతున్నారు. కలిసుంటే కలదు సుఖం అంటున్నారు. పైన ఫోటో చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది మరి. అంతగా ఒకరంటే ఒకరు ప్రేమగా కలిసిపోయారు.
కొన్నేళ్లుగా కమెడియన్స్ ఓ పద్దతి ఫాలో అవుతున్నారు. కచ్చితంగా ఖాళీ ఉన్నపుడు కలిసి పార్టీ చేసుకోవాలని అనుకున్నారు. అందుకు తగినట్లుగానే కుదిరినప్పుడల్లా ఇలా కలుసుకుంటున్నారు. 2018లో ఈ ఆనవాయితీ మొదలైంది. అప్పట్లో ఈ పార్టీ ప్రతీ నెల చేసుకున్నారు కమెడియన్లు. పార్టీ అంటే ఏదో అల్లాటప్పాగా కాకుండా ప్రతీసారి ఓ థీమ్ తో కలుస్తున్నారు. ఒకసారి వెన్నెల కిషోర్ ఇంట్లో కలుసుకున్నపుడు అంతా బ్యాక్ టూ స్కూల్ అన్నారు. అందుకే అప్పుడు అంతా స్కూల్ డ్రస్ లో కనిపించారు. ఆ తర్వాత చందమామ థీమ్ వేసుకున్నారు. అంటే ఆ సినిమాలో ఆహుతి ప్రసాద్ వేసుకున్నాడు కదా ఆ పంచెల క్యాస్టూమ్ అన్నమాట.
ఆ తర్వాత కూలి నెంబర్ వన్ థీమ్ అన్నమాట. అది కమెడియన్ ప్రవీణ్ ఇంట్లో జరిగింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మరోసారి కబమెడియన్స్ అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ధన్ రాజ్ ఈ పార్టీ ఫోటోస్ ను తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసాడు. ఇండస్ట్రీలో ఉన్న 9 మంది కమెడియన్స్ ఇందులో ఉన్నారు. వెన్నెల కిషోర్ (vennelakishore) .. వేణు.. సత్య.. నవీన్.. సప్తగిరి.. చిత్రం శ్రీను.. ధన్ రాజ్ (dhanraj) .. సత్యం రాజేష్.. శ్రీనివాస్ రెడ్డి లాంటి కమెడియన్లు ఉన్నారు. మొత్తానికి ప్రతీ సారి ఇలాంటి పార్టీలు హీరోలు కూడా చేసుకుంటే ఇండస్ట్రీలో ఒక్క ఫ్యాన్ వార్ కూడా ఉండదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha As Khatija | సమంత పాత్రను పరిచయం చేసిన డైరెక్టర్..
Prakash Raj silence | నా గొంతుకు వారం విశ్రాంతి..ప్రకాశ్‌రాజ్ ట్వీట్ వైరల్
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి