Nandi Awards | ఈ ఏడాది సెప్టెంబరు 24న దుబాయ్‌లో జరగనున్న నంది అవార్డుల వేడుకకు ఫిల్మ్‌ఛాంబర్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆ వేడుక ఆర్కే గౌడ్ వ్యక్తిగతమని, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నాయి.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లు మాత్రమే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించబడిన సంస్థలు అని, ఈ వేడుకలో మా సంస్థల తరపున ఎవరు హాజరుకావడం లేదని, ఈ అవార్డుల వేడుక పూర్తి వ్యక్తిగతమని తెలుగు ఫిల్మ్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి, కేఎల్ దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి అనుపమ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.