తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ ఫిలించాంబర్‌లో జరిగాయి. ఉదయం నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. ఈ కౌన్సిల్లో మొత్తం 1134 మంది సభ్యులున్నారు. ఇందులో 678 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల్లో దామోదర ప్రసాద్ అధ్యక్షుడిగా గెలుపొందారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన జెమినీ కిరణ్‌పై 24 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ గెలుపొందారు. ఆయనకు దిల్ రాజు సారథ్యంలోని ప్రొడ్యూసర్స్ గిల్డ్ మద్దతు ఇచ్చింది. ఉపాధ్యక్షులుగా కె. అశోక్ కుమార్, సుప్రియ, కోశాధికారిగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ విజయం సాధించారు. కార్యదర్శులుగా ప్రసన్నకుమార్, వైవీఎస్ చౌదరి, జాయింట్ సెక్రటరీలుగా భరత్ చౌదరి, నట్టికుమార్ ఎన్నికయ్యారు. ఈసీ మెంబర్స్‌గా దిల్ రాజు, డీవీవీ దానయ్య, రవికిషోర్, అభిషేక్ అగర్వాల్, బెక్కెం వేణుగోపాల్ తదితరులు గెలుపొందారు.