Telugu Film Producer Council Elections | తెలుగు నిర్మాతల మండలి పోలింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాతలు దామోదర ప్రసాద్, జెమిని కిరణ్ అధ్యక్ష బరిలో ఉన్నారు. 2023-25 నూతన కార్యవర్గాన్ని నిర్మాతల మండలి సభ్యులు ఎన్నుకోనున్నారు. సాయంత్రానికి పోలింగ్ ముగియనుంది. కాగా నిర్మాతల మండలికి సాధారణంగా ప్రతి రెండేళ్ళకి ఒకసారి ఎన్నికలు నిర్వహించేవారు కానీ కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కొన్ని రోజుల క్రితం చిన్న నిర్మాతలు ఎలక్షన్స్ నిర్వహించాలని ధర్నాకి కూడా దిగారు.
ఆ సమయంలో నిర్మాతల మండలిలో వివాదాలు చెలరేగాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేశారు. ఎట్టకేలకు నిర్మాత సి కళ్యాణ్ ఎలక్షన్స్ ని ప్రకటించారు. ఇక ఈ ఎలక్షన్లలో దామోదర్ ప్రసాద్‌కు దిల్‌రాజు మద్దతిచ్చాడు. ఇక జెమిని కిరణ్‌కు సి. కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. దీని ఫలితాలు సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ ఎలక్షన్లు జరిగిన రచ్చ రచ్చ అవుతుంది. ఏడాది క్రితం జరిగిన మా ఎలక్షన్ రచ్చ ఇంకా మర్చిపోలేము. ఇక గత కొన్ని రోజులుగా నిర్మాతల మండలి ఎన్నికోల కోసం అదే రచ్చ జరుగుతుంది.