Tollywood : టాలీవుడ్లో 18 రోజులుగా కొనసాగుతన్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. వేతనాల పెంపు కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఫిల్మ్ ఛాంబర్ .. అటు పట్టువీడని నిర్మాతల మధ్య లేబర్ కమిషనర్ సయోధ్య కుదిర్చారు. ప్రభుత్వ జోక్యంతో రంగంలోకి దిగిన లేబర్ కమిషనర్ గంగాధర్ (Gangadhar)ఇరువర్గాలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. కాసేపట్లో ఇరువర్గాలు కండీషన్లు, డిమాండ్లు, రాజీ కుదరిన అంశాలపై సంయుక్త ప్రకటన వెల్లడించే అవకాశముంది.
ఆగస్టు 4 నుంచి తెలుగు చిత్రసీమలో రెండు వారాలకు పైగా నిలిచిపోయిన షూటింగ్లు మళ్లీ మొదలవ్వనున్నాయి. నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ మధ్య సుదీర్ఘ చర్చల తర్వాత పరస్పర అంగీకారం కుదరడమే అందుకు కారణం. ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు డిమాండ్ చేసిన 9 టూ 9 కాల్షీట్లకు నిర్మాతలు ఆమోదం తెలిపారు. 2 వేల లోపు వేతనం ఉన్నవాళ్లకు మొదట ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం మూడో ఏడాది 5 శాతం పెంపునకు ఇరువర్గాలు సరేనన్నాయి.
మొదటి ఏడాది 7.5 శాతం. రెండో ఏడాది ఉన్నవాళ్లందరికీ ఇదే సూత్రం వర్తిస్తుందని.. 2వేల నుంచి 5 వేల మధ్య వేతనం ఉంటే మొదటి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం వేతనాలు.. మూడేళ్ల కాలానికి 22.5 శాతం జీతాల పెంపునకు నిర్మాతలు అంగీకరించారని గంగాధర్ తెలిపారు. ఇతర సమస్యల పరిష్కారానికి ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.