Raaka | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ‘రాకా’ సినిమా వస్తుందని తెలిసిందే. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే మలయాళ నటి ఫెమినా జార్జ్, పంజాబీ నటి నైలా గ్రేవల్ భాగమైనట్టు క్రేజీ అప్డేట్స్ వచ్చాయని తెలిసిందే. తాజాగా మరో ఆసక్తికర నెట్టింట వైరల్ అవుతోంది.
తెలుగు నటి సిరి హన్మంతు ‘రాకా’ చిత్రంలో జాయిన్ అయింది. రీసెంట్గా జరిగిన ఓ ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. సిరి హన్మంతు చివరగా సీతాపయనంలో మెరవగా.. త్వరలో విడుదల కానున్న ‘ చెన్నై లవ్ స్టోరీ’ లో కూడా సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఇంతకీ సిరి హన్మంతు రాకా మూవీలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ముంబైలో షూటింగ్ కొనసాగుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తోంది. ఈ మూవీని 2027 చివరలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.