Maha Shivratri Special – Telugu Cinema | శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఈ పర్వదినాన ఉపవాసం, జాగరణ చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నం అవుతాడని నమ్ముతారు. అందుకే శివరాత్రి నాడు నిష్టతో ముక్కంటిని ఆరాధిస్తారు. ఓం నమఃశివాయ అని స్మరించుకుంటూ పగలంతా ఉపవాస దీక్షలో.. సాయంత్రం దైవ చింతలో మునిగిపోతారు. అయితే శివుడితో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పాలి. సీనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఏఎన్ఆర్, చిరంజీవితో పాటు పలువురు అగ్ర కథానాయకులు శివుడి పాత్రతో పాటు అతడి భక్తులుగా నటించిన అభిమానులను అలరించారు. అయితే ఇప్పటివరకు శివుడి నేపథ్యంలో వచ్చి అలరించిన తెలుగు సినిమాలను ఒకసారి చూసుకుంటే..
ఎన్టీఆర్ దక్షయజ్ఞం
Dakshayaganm
1962లో సీనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన భక్తిరస పౌరాణిక చిత్రం దక్ష యజ్ఞం. తన కెరీర్లో 100వ చిత్రంగా వచ్చిన ఈ చిత్రానికి కడారు నాగభూషణం దర్శకత్వం వహించగా, ఎస్.వి. రంగారావు, దేవిక తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ శివుడి పాత్రలో నటించి సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఎన్టీఆర్ శివుడి పాత్రను పోషించిన ఏకైక సినిమాగా ఇది ఇప్పటికి చరిత్రలో నిలిచిపోయింది.
మూగ మనసులు
Mooga Manasulu
సీనియర్ ఎన్టీఆర్ తర్వాత శివుడి పాత్రలో నటించిన మరో దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మూగ మనసులు. 1964లో వచ్చిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించగా.. సావిత్రి, జమునా, అల్లు రామలింగయ్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పునర్జన్మ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో “గౌరమ్మ నీ మొగుడెవరమ్మ” అనే పాటలో శివుడి రూపంలో కనిపించారు అక్కినేని నాగేశ్వరరావు.
శ్రీ వినాయక విజయము, భక్త కన్నప్ప
bhkata kannappa
ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత శివుడి పాత్రలో నటించిన మరో నటుడు కృష్ణంరాజు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శ్రీ వినాయక విజయము. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 1979లో విడుదలైంది. ఇందులో శివుడి పాత్రలో నటించి అలరించారు కృష్ణంరాజు. ఇంకా ఇదే కాకుండా కృష్ణంరాజు శివుడి భక్తుడిగా నటించిన చిత్రం భక్త కన్నప్ప(). కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్ నటించిన కన్నడ చిత్రం “బెడార కన్నప్ప”కి తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది. తెలుగులో ఈ సినిమాకు బాపు దర్శకత్వం వహించగా, ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు నిర్మించారు.
పరమానందయ్య శిష్యుల కథ
Shoban Babu
సీనియర్ ఎన్టీఆర్, దివంగత నటుడు శోభన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పరమానందయ్య శిష్యుల కథ. 1966లో వచ్చిన ఈ సినిమాకు సి.పుల్లయ్య దర్శకత్వం వహించగా.. ఘంటసాల సంగీతం అందించారు. ఈ చిత్రంలో శివుడి పాత్రలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు శోభన్ బాబు. ఇక ఇదే చిత్రాన్ని 1981లో కన్నడలో “గురు శిష్యరు” పేరుతో రీమేక్ చేశారు.
మగరాయుడు
ఈ చిత్రంలో కమెడియన్ మల్లికార్జున రావు శివుడి పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఒక యాక్షన్ డ్రామా అయినప్పటికీ, శివుడి పాత్ర కొన్ని భక్తి సన్నివేశాల్లో భాగమైంది.
మావూర్లో మహాశివుడు
దివంగత నటుడు రావు గోపాలరావు ఈ చిత్రంలో శివుడి పాత్రలో కనిపించారు. ఈ సినిమా శివ భక్తి నేపథ్యంలో సాగే ఒక డ్రామా.
భూకైలాస్ &నాగుల చవితి
తెలుగు పరిశ్రమ తొలితరం నటులలో ఒకడైన నాగభూషణం కూడా శివుడిగా కనిపించారు. రావణుడి శివ భక్తి కథ ఆధారంగా రూపొందిన భూకైలాస్ చిత్రంలో శివుడిగా నటించడంతో పాటు నాగుల చవితి చిత్రంలో కూడా శివుడి పాత్రలో మెరిశాడు.
శివ శివ (1984)
శివుడిపై భక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో చిరంజీవి శివుడి పాత్రలో కనిపించలేదు కానీ, కథ శివుడి చుట్టూ తిరుగుతుంది. భక్తి రసంతో కూడిన డ్రామా. ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించగా.. చిరంజీవి కథానాయకుడిగా నటించాడు.
శ్రీ మంజునాథ
Sri Manjunaatha
శివుడి పాత్రలో నటించిన మరో అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం శ్రీ మంజునాథ. 2001లో వచ్చిన ఈ సినిమాకు దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. కన్నడ సూపర్స్టార్లైన అంబరీష్, అర్జున్ సర్జా, సౌందర్య, మీనా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా శివ భక్తుడైన మంజునాథ (ధర్మస్థల మంజునాథేశ్వర స్వామి) జీవితం ఆధారంగా రూపొందింది. దుష్ట స్వభావం గల వ్యక్తిగా జన్మించిన మంజునాథుడు, శివ భక్తి ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతికి ఎలా చేరుకుంటాడు అనేది ఈ సినిమా స్టోరీ. హంసలేఖ ఈ సినిమాకు సంగీతం అందించగా.. ఇందులోని పాటలు చార్ట్ బస్టర్‌గా నిలిచాయి.
శ్రీ సత్యనారాయణ మహత్యం
సుమన్ ఈ చిత్రంలో శివుడి పాత్రలో కనిపించారు. ఈ సినిమా సత్యనారాయణ స్వామి కథ ఆధారంగా రూపొందినప్పటికీ, శివుడి పాత్ర కొన్ని కీలక సన్నివేశాల్లో భాగమైంది.
అఖండ
Akhanda
శివుడి నేపథ్యంలో వచ్చిన మరో చిత్రం అఖండ. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. 2021లో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్‌గా కూడా తెరకెక్కుతుంది. అఖండ సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో బాలయ్య ఒకటి సాధారణ వ్యక్తిగా, మరొకటి “అఖండ” అనే పవర్ఫుల్ రోల్లో నటించారు. ఇక అఖండగా బాలకృష్ణ చేసే తాండవం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. అఖండ ఒక ఆగమ వాదిగా, ధర్మ రక్షణ కోసం పోరాడే వ్యక్తిగా ఇందులో చూపించబడ్డాడు. మరోవైపు సీతరామ కళ్యాణం అనే సినిమాలో కూడా బాలకృష్ణ శివుడి పాత్రలో కనిపిస్తాడు.
ప్రకాష్ రాజ్ – డమరుకం
Damarukham
నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ శివుడి పాత్రలో నటించారు. ఈ చిత్రం ఒక సోషియో-ఫాంటసీ జానర్లో రూపొందింది, ఇందులో శివుడి రూపం స్టైలిష్‌గా చూపించబడింది.