నివాస్, అమితశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ‘తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా’. 30ఇయర్స్ పృథ్వి కీలక పాత్ర పోషిస్తున్నారు. వెంకటేశ్ వీరవరపు దర్శకత్వంలో శరత్ చెన్నా నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు క్లాప్ ఇవ్వగా, సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ కెమెరా స్విచాన్ చేశారు. పూర్తిస్థాయి కామెడీ ఎంటైర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పృథ్వీ, వినోద్‌కుమార్, రఘుబాబు పాత్రలు కీలకంగా ఉంటాయని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: అభిలాష్.ఎం, సంగీతం: అజయ్ పట్నాయక్, నిర్మాణం: చెన్నా క్రియేషన్స్.