Game Changer | గేమ్ ఛేంజర్ (Game Changer) టికెట్ రేట్లతో పాటు బెనిఫిట్ షోలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు (High Court) నేడు విచారణ జరిగింది. పుష్ప 2 ది రూల్ సినిమాకు సంబంధించి సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన మరవకముందే మరో సినిమాకు బెనిఫిట్ షోలు అనుమతినివ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దని చెప్పి మళ్లీ ప్రభుత్వమే అనుమతి ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించింది.
ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్ షోలకు అనుమతించొద్దని తెలిపింది. అంతేగాకుండా నిర్మాతలు భారీ బడ్జెట్తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి అన్యాయంగా వసులు చేయడం సరికాదని తెలిపింది. అలాగే అర్థరాత్రి 1 గంటల తర్వాత సినిమా షోలకి పర్మిషన్ ఇవ్వడంపై పునఃసమీక్షించాలని కోరింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తను ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను జనవరి 24కి వాయిదా వేసింది.
Also Read..