Anil Kurmachalam Condolences for Veteran Actress Krishnaveni Death | టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. అలనాటి తార నటి కృష్ణవేణి (102) కన్నుమూసింది. వయసు రీత్య అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణవేణి మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకి నివాళులు ఆర్పిస్తున్నారు.
ఇక కృష్ణవేణి మృతి పట్ల తెలంగాణ ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కుర్మాచలం (Anil Kurmachalam) సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)ను సినీరంగానికి హీరోగా పరిచయం చేసిన ఆమె ఆ తరువాత అనేక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిందని, కృష్ణవేణి గారు నటిగా, నిర్మాతగా, నేపథ్య గాయనిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుందని ఆమె మరణం సినీ రంగానికి తీరని లోటని… కృష్ణవేణి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.